
ఈ ఆర్టికల్ లో, మీకు ది.22-12-2020 నాడు జారీ చేసిన నోటిఫికేషన్ నెంబర్. 94/2020-Central Tax లో, రిజిస్ట్రేషన్ కు సంబందించి వచ్చిన మార్పులు గురుంచి, మీకు అర్ధం అయ్యేలా వివరించడం జరిగింది. ముందుగా, రిజిస్ట్రేషన్ కు సంబంధించి, కొత్తగా తెచ్చిన మార్పులు Rule No.8(4A) ద్వారా అమలు పర్చడం జరుగుతుంది. కానీ, ఏ తేదీ నుండి మార్పు చెందిన, ఈ రూల్ నెంబర్ 8(4A) అమలు లోకి వస్తుందో చెప్పడం జరగలేదు. కనుక రూల్ నెంబర్ 8(4A) అమలులోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసేంతవరకూ ఈ మార్పులు అప్లై కావు. కనుక ఇది గమనించగలరు
కొత్తగా జారీ చేసిన నోటిఫికేషన్ లో, రిజిస్ట్రేషన్ పద్దతి లో భారీ మార్పులు చేసే దిశగా అడుగులు పడినట్టు అర్ధమవుతుంది. ఆ మార్పులు వెనుక ఉన్న ఉద్దేశం, ఈ మధ్యన బయటపడిన వందల కోట్ల ఫేక్ బిల్లుల (Fake Invoices) ఫ్రాడ్.
ఆ స్కాం లో జరిగిన సంగతి ఏంటంటే – ఫేక్ రిజిస్ట్రేషన్ లు తీసుకుని, బిల్లులు ఇవ్వడం, కొన్న వాళ్ళు ఇన్పుట్ (Input tax credit) తీసుకోవడం మరియు అమ్మినవాళ్లు రిటర్న్స్ వేయకుండా పన్ను ఎగ్గొట్టడం. రికవరీ చేద్దామనుకుంటే, రిజిస్ట్రేషన్ కు వాళ్ళు తప్పుడు సమాచారం ఇవ్వడంతో, చర్యలు ఆలస్యం కావడం లేదా కొన్ని సందర్భాలలో ఆ వ్యక్తి మన దేశం విడిచి వెళ్లిపోవడం. ఇలాంటివి ఆపడానికి ఎన్నో కొత్త మార్పులు తీసుకురావడం జరుగుతుంది
చర్యలలో ముందుగా,

BIOMETRIC AUTHENTICATION
ఇప్పటిదాకా, ఆధార్ తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ కు లేదా E-Mail కు వచ్చే One TIme Password (OTP) తో, అప్లికేషన్ ఫైల్ చేస్తే సరిపోయేది. అలా ఫైల్ చేసిన అప్లికేషన్ ప్రోసెస్ (Process) చేసే విధానంలో, ప్రత్యక్ష తనిఖీ (On-site inspection) అవసరం కూడా లేదు. కానీ ఇప్పుడు బయోమెట్రిక్ విధానం అమలులోకి తీసుకురావడం వలన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ముందుగా, ఆ నోటిఫికేషన్ లో బయోమెట్రిక్ (Biometric) అనే పదం వాడడం జరిగింది. బయోమెట్రిక్ అంటే సాధారణంగా మనం రేషన్ లేదా ఆధార్ లో మార్పులు చేసుకునేటప్పుడు ఫింగర్ ప్రింట్ (Finger Print) వేస్తాం కదా!, అలాంటిది. కనుక ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఫింగర్ ప్రింట్ వెయ్యాల్సిందే. దానితో పాటు, అర్జీదారుని (Applicant) లైవ్ ఫోటో కూడా అప్ లోడ్ చేయాల్సిఉంది (డిజిటల్ సిగ్నేచర్ అప్లై చేసేటప్పుడు, ఎలా అయితే వీడియో రికార్డు చేస్తామో, ఆలా అయిఉండవచ్చు)

VERIFICATION OF ORIGINAL DOCUMENTS
ఇంకా, మనం రిజిస్ట్రేషన్ అప్లై చేసేటప్పుడు, అప్ లోడ్ చేసిన డాకుమెంట్స్ వెరిఫికేషన్ . ఇకపై ఒరిజినల్ (Original) రెంట్ అగ్రిమెంట్, మునిసిపల్ ఖాతా కాపీ లేదా వేరే ఏదైనా డాక్యుమెంట్ అప్ లోడ్ చేసినట్టు అయితే, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ లు తీసుకువెళ్లి, CBIC నోటిఫై చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ లో వెరిఫికేషన్ చేయించుకోవాలి. అంటే నోటరీ చేయించినట్టుగా అనమాట. ఇది కూడా కాస్త ఆలస్యానికి తోడ్పాటు కలిగించేలా ఉంది.
కాకపొతే, సెక్షన్ 25(6D) లో నోటిఫై చేసిన వ్యక్తులకు, పైన చెప్పబడిన ప్రాసెస్ అప్లై కాదు. పై సెక్షన్ కు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయడం జరగలేదు. కనుక వేచి చూడాల్సిన అవసరం ఉంది.
మరియు ……
ప్రత్యక్ష తనికీ కూడా తప్పనిసరి చేయడం కూడా జాప్యానికి కారణం అయ్యేట్టు కనిపిస్తుంది. ఇప్పటి వరకూ , ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత, చాలా వర్గాలలో కొంత అనిశ్చితి నెలకొనడం జరిగింది. దీనిపై, CBIC తదుపరి సర్కులర్ (Circular) ఇచ్చేవరకూ వేచి చూచి, అప్పుడ దీనిలో ఉన్న కష్టనష్టాలు బేరేజి వేసుకోవడం మంచిది అని మా అభిప్రాయం.
పైన వివరించిన వ్యాసం మొత్తం మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. వాటికి ఎటువంటి చట్టపరమైన ప్రామాణికం లేదని గమనించగలరు.
ధన్యవాదాలు
AYYAPPA, Lead consultant and Advisory
Good explanation ..